స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. మధ్యతరగతి ఇంట్లో ఉండే కష్టాలు పోవాలంటే గొప్పింటికి కోడళ్ళని చేయాలనే ఒక అమ్మ తపనతో మొదలైన ఈ కథ.. రోజు రోజుకి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కాగా ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ - 7 లో.. ఇంతకు ముందు వచ్చిన కళావతినే నీకు భార్యగా వస్తే ఏం చేస్తావ్ అని రాజ్ తో అంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా..రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజ్ ఇంట్లో జరుగుతున్న పూజకు కనకం తన కూతుళ్ళతో వస్తుంది. లోపలికి వెళ్ళేముందు సెక్యూరిటీ వాళ్ళని ఆపుతాడు. పాస్ చూపించు అనగా... మొత్తం వెతుకుతుంది కనకం. తీరా చూస్తే పాస్‌లు మర్చిపోయి వస్తారు. సెక్యూరిటిని ఎంత బ్రతిమాలినా కూడా వినిపించుకోడు... లోపలికి వెళ్లనివ్వడు.
విసిగిస్తున్నారని కనకం కూతురు అప్పును తోసేస్తాడు సెక్యూరిటి. అప్పుడే కనకం మరో కూతురు కావ్య పాస్ లు పట్టుకొని వస్తుంది. పడిపోబోతుంటే అప్పు ని పట్టుకుంటుంది కావ్య. ఇంట్లో వాళ్ళే కాదు.. ఇంట్లో పని చేసే వాళ్ళకి కూడా పొగరు అంటూ సెక్యూరిటికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆ తర్వాత అందరూ పాస్ లు తీసుకొని లోపలికి వెళ్తారు. మరోవైపు ఇంటికెళ్తున్న కావ్యని చూసి "మీరు వెళ్లిపోతున్నారా.. పూజ కి ఉండట్లేదా?" అని కళ్యాణ్ అడుగుతాడు. కావ్య వెళ్లిపోతున్నా అని చెప్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరు కూడా మా డబ్బుని చూసి వస్తున్నారు. నిజానికి ఈ పూజకి రావడానికి మీకు ఒక్కరికే అర్హత ఉంది అని అంటాడు. ఒక కవిగా పిలుస్తున్నాను.. వినాయకుడు మీ మీద అలుగుతాడని కళ్యాణ్ చెప్పేసరికి సరే అంటూ కావ్య ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు.
రాజ్ దృష్టిలో స్వప్నని ఎలా పడకొట్టాలని కనకం ఆలోచిస్తుంది. " అటుగా వస్తున్న రాజ్ ని డ్యాష్ ఇవ్వమని చెప్తుంది. అయినా రాజ్ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిని చూసి.. ఆ డాన్స్ స్వప్నతో చేయించాలని, ఆ డాన్స్ చేసే అమ్మాయిని కిందకి పడేలా చేసి.. ఆ అమ్మాయి ప్లేస్ లో స్వప్నని రెడీ చేస్తుంది కనకం. నిజానికి స్వప్నకి డాన్స్ రాదు. కావ్య నేర్పిస్తూ ఉంటుంది. తన కూతళ్ళని గొప్పింటికి కోడళ్ళుగా చేయాలనే కనకం ఆశ ఫలిస్తుందా లేదా చూడాలి.